రైలు ప్రయాణ సమయాల్లో చాలా మంది వివిధ రకాల సాహసాలు చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ముంబై లోకల్ రైలు ఓ స్టేషన్‌లో ఆగగానే.. ఓ వైపు ఎక్కేవారు, దిగి వారితో అక్కడ ఉన్నట్టుండి తోపులాట చోటు చేసుకుంది. అంతటి తోపులాట మధ్య ఓ వ్యక్తి.. రైలు దిగేందుకు తన శక్తిని మొత్తం ఉపయోగించి వారిని చేత్తో బలంగా కొట్టాల్సి వచ్చింది. చివరకు ధబేల్‌మని కిందపడ్డాడు.