Homeహైదరాబాద్latest NewsPawan Kalyan : డిప్యుటీ సీఎం పవర్స్ ఏంటి?

Pawan Kalyan : డిప్యుటీ సీఎం పవర్స్ ఏంటి?

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠ వీడింది. పవన్ కల్యాణ్‌కు ఏ శాఖ కేటాయిస్తారోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన విచక్షణాధికారాల ద్వారా డిప్యుటీ సీఎం పదవిని కేటాయించారు. వాస్తవానికి డిప్యుటీ సీఎం పదవి గురించి భారత రాజ్యాంగంలో ప్రస్తావించకపోయినా ఆర్టికల్ 164 (1) ప్రకారం ముఖ్యమంత్రికి తన మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఈ నిబంధన ప్రకారమే పవన్‌కు డిప్యుటీ సీఎం పదవిని కేటాయించారు. సంకీర్ణ ప్రభుత్వాలు, మెజార్టీ తక్కువగా ఉన్న ప్రభుత్వాలు, పొత్తులో భాగంగా డిప్యుటీ సీఎం పదవిని ఆయా అభ్యర్థులకు కేటాయిస్తున్నారు. ఇటీవలి కాలంలో దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఈ విధానం బాగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉంటూ క్యాబినెట్‌లో కీలక పాత్ర పోషించే అధికారాలు డిప్యుటీ సీఎంకు ఉంటాయి. ముఖ్యమంత్రి అందుబాటులో లేని సమయంలో డిప్యుటీ సీఎం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు.

Recent

- Advertisment -spot_img