పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ గెలుపొందటంపై పవన్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘‘డియర్ కళ్యాణ్ బాబు.. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా.. అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను’’అని ట్వీట్ చేశారు.