Homeహైదరాబాద్latest Newsఎన్టీఆర్, కేజీఎఫ్ డైరెక్టర్ మధ్య ఏం జరిగింది?.. ప్రశాంత్ నీల్ పెట్టిన ఆ కండిషన్ ఏంటి?

ఎన్టీఆర్, కేజీఎఫ్ డైరెక్టర్ మధ్య ఏం జరిగింది?.. ప్రశాంత్ నీల్ పెట్టిన ఆ కండిషన్ ఏంటి?

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ‘దేవర’ సినిమా ద్వారా థియేటర్లోకి అడుగుపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ‘దేవర’ సినిమా హిట్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. మొదటి రోజు మిక్స్‌డ్ టాక్‌తో నడిచిన.. ఆ తర్వాత రికార్డు కలెక్షన్లు రాబట్టింది. బ్రేక్ ఈవ్ కూడా అయిపోయి క్లీన్ హిట్ అయింది. దీంతో తారక్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ పైనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. కేజీఎఫ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ కి టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2025 జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నెటిజన్లు ఇప్పటికే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ మూవీకి దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కు ఓ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు పెరగడానికి చిన్న కండిషన్ పెట్టాడని వినిపిస్తోంది. దీని కోసం ప్రత్యేక ఆహారాన్ని అనుసరించాలి. సినిమా కోసం బరువు పెరగడం, తగ్గడం ఎన్టీఆర్‌కి కొత్త కాదు. ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రశాంత్ నీల్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్ ఉన్న స్ట్రాంగ్ హీరో పాత్రలో కనిపించనున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ అనే టైటిల్‌ని ఎంచుకున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img