బ్రిటన్‌కు చెందిన టైటానిక్ నౌక 1912, ఏప్రిల్‌లో అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయి కొన్ని వేలమంది మరణించారు.
లైఫ్‌బోట్లు ఉపయోగించిన వారిలో కొందరు ఒడ్డుకు చేరగలిగారు. ప్రమాదంలో ఇంకా ఎవరైనా బతికారా వెతకడానికి వచ్చిన బృందానికి ఓ వ్యక్తి కనిపించాడు.
నైక తలుపు చెక్కను పట్టుకుని వణుకుతూ కనిపించిన వ్యక్తి ఓ చైనా జాతీయుడు.
నౌక ప్రమాదంలో బతికిన ఆరుగురు చైనీయులలో ఫాంగ్‌లాంగ్ ఒకరు. అతన్ని రక్షించే సీన్‌ను 1997 లో వచ్చిన టైటానిక్ సినిమాలో ప్రత్యేకంగా చిత్రించారు.
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ 24 గంటల్లో వారిని న్యూయార్క్ దగ్గరలోని ఎల్లిస్ అనే దీవికి చేర్చారు.
అయితే అప్పటికే అమలులో ఉన్న చైనీస్ ఎక్స్‌క్లూజన్ యాక్ట్ వల్ల వారిని అమెరిక నుంచి చైనా పంపించారు.
చైనా దేశస్తులు తమ దేశంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు అమెరికా ఈ చట్టాన్ని చేసింది.
ఆ ఆరుగురు ఎవరు ?
టైటానిక్ ప్రమాదం నుంచి బైటపడ్డ చైనీయుల పేర్లు లీ బింగ్, ఫాంగ్‌లాండ్, చాంగ్ చిప్, అహ్ లామ్, చుంగ్‌ఫూ, లింగ్ హీ.
ఉపాధి కోసం వారంతా కరీబియన్ దీవులకు వెళుతున్నట్లు భావిస్తున్నారు.
వీళ్లు చైనా దేశం వారు కావడం వలన మీడియాలో వీరి పట్ల వివక్ష కనిపించిందని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
ఓడ మునుగుతున్న సమయంలో ఓడలోని వారిని రక్షించడంలో చైనీయులు సాయపడ్డారని మాల్టిన్ చెప్పారు.
ఓడ మునిగిన తర్వాత తలుపును పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్న వారు చాలామందిని ఒడ్డుకు చేర్చడంలో సాయపడ్డారని ఆయన వెల్లడించారు.
ప్రమాదం తర్వాత ఏమయ్యారు ?
అమెరికా వారిని తిరస్కరించడంతో ఆ ఆరుగురు క్యూబా దేశం వెళ్లిపోయారు. అక్కడి నుంచి బ్రిటన్ వెళ్ళారు.
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్‌లో నావికుల కొరత తీవ్రంగా ఉండటంతో వారికి అక్కడ ఉపాధి దొరికింది.
న్యుమోనియ కారణంగా అందులో ఒకరు 1914లో మరణించారు. లండన్‌లోని ఓ ప్రాంతంలో ఆయన్ను సమాధి చేశారు.
మిగిలిన చైనీయులంతా 1920 వరకు ఒకేచోట కలిసి పని చేశారు.
మొదటి ప్రపంచ యుద్ధ అనంతరం దేశంలో ఆర్ధిక సంక్షోభం తలెత్తడంతో వలసదారులపై స్థానికులలో వ్యతిరేకత మొదలైంది.
వారిలో కొందరు బ్రిటన్ దేశస్తులను పెళ్లి చేసుకున్నా వలసదారులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలతో వారు తమ కుటుంబాన్ని కూడా వదిలి వెళ్లాల్సి వచ్చింది.