Homeహైదరాబాద్latest Newsపరగడుపునే పసుపు నీళ్లు తాగితే ఏం జరుగుతుంది?

పరగడుపునే పసుపు నీళ్లు తాగితే ఏం జరుగుతుంది?

పసుపు మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఉంచుతుంది. పసుపులో ఉన్న యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గాయాలను నయం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇది మన దేశంలోని ప్రతి వంటింట్లో తప్పక ఉండే మసాలా దినుసు.. ఇది వంటకు రంగుతో పాటు రుచికరంగా కూడా చేస్తుంది. అందుకే ఒక సూపర్‌ఫుడ్ అంటారు. ఇది క్యాన్సర్‌తో పోరాడి డిప్రెషన్‌ని తగ్గిస్తుంది. పసుపులో ఉండే అనేక సమ్మేళనాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది కర్కుమిన్. ప్రతి రోజూ ఉదయాన్నే పసుపు నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తరచుగా జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు పసుపు నీటిని తీసుకోవటం వల్ల ఫలితం ఉంటుంది. దీంతో మీరు ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండగలరు. పసుపు అనేది విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలతో సమృద్ధిగా ఉండే సూపర్ ఫుడ్. ఈ అంశాలన్నీ మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుండి మనలను రక్షిస్తాయి. ఇది శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచుతుంది. శక్తితో నిండి ఉంటుంది.

మరీ ముఖ్యంగా శీతాకాలంలో టర్మరిక్ డ్రింక్ తాగడం ద్వారా ఫిట్‌గా ఉండొచ్చు. ముందుగా నీటిని మరిగించాలి. తర్వాత అందులో పసుపు, సోంపూ, అల్లం ముక్క వేయాలి. 5 నుండి 7 నిమిషాలు మంట తగ్గించి మరిగించాలి. కాస్త చల్లరిన తర్వాత ఇప్పుడు దానికి తేనె, నిమ్మరసం కలపండి. గోరువెచ్చగా, కావాలంటే వేడిగా ఉండగానే తాగేయొచ్చు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ వేడి పసుపు పానీయం తాగితే, ఫిట్‌గా ఉండవచ్చు. పసుపులోని కర్కుమిన్ మెదడులోని నరాల మార్గాలను రక్షించడానికి మెమరీ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ సెన్సెటివీ పెరుగుతుంది. స్త్రీలల్లో వచ్చే నెలసరి నొప్పి కూడా తగ్గుతుంది. పసుపులో అనేక రకాల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కడుపులోని చెడు బ్యాక్టీరియాను చంపి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పసుపు చెడుగు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. పసుపులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి వాపు సంబంధిత సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తాయి. పసుపులోని యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేయడంలో చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి.

Recent

- Advertisment -spot_img