What happens to Google data if the user dies : యూజర్ చనిపోతే గూగుల్ డేటా ఏమవుతుంది..?
Google Inactive account manager | ఈ రోజుల్లో గూగుల్ అకౌంట్ లేని వ్యక్తి ఉండడంటే అతిశయోక్తి కాదు..
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ గూగుల్ అకౌంట్ ఉంటుంది. ఫోన్ డేటా గూగుల్‌కు బ్యాకప్ ఉంటుంది.
ఫోన్‌లో దిగిన ఫొటోలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు అన్నీ గూగుల్ ఫొటోస్, గూగుల్ డ్రైవ్‌లోకి ఎప్పటికప్పుడు బ్యాకప్ చేస్తూనే ఉంటాం.
అవసరం ఉన్నప్పుడు గూగుల్‌లో లాగిన్ అయి ఆ సమాచారాన్ని తీసుకుంటుంటాం.
మనం ఉన్నంత వరకు అంటే ఓకే.. కానీ అదే మనం పోతే !! మనం చనిపోతే గూగుల్ డేటా ఏమవుతుంది?
మన అకౌంట్ పాస్‌వర్డ్ మన కుటుంబసభ్యులు, స్నేహితులు ఎవరికైనా తెలిస్తే వారు ఓపెన్ చేస్తారు..
లేకపోతే మన అకౌంట్‌లో ఉన్న సమాచారం అంతా ఏమవుతుంది? ఆ డేటాను గూగుల్ ఏం చేస్తుందనేది ఎప్పుడైనా ఆలోచించారా?
గూగుల్ అకౌంట్‌ను చాలా కాలం ఓపెన్ చేయకుండా వదిలేస్తే అవి ఇన్‌యాక్టివ్ మోడ్‌లోకి వెళ్లిపోతాయి.
అలా ఒక ఖాతా ఇన్‌యాక్టివ్ అయినప్పుడు అందులోని డేటాను ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని గూగుల్ కంపెనీ..
యూజర్‌కే వదిలేసింది. ఇందుకోసం రెండు ఆప్షన్లు ఇచ్చింది. myaccount.google.com/inactive లింక్ ఓపెన్ చేసి మన ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది.
సన్నిహితులకు ఓపెన్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు
✎ ముందుగా myaccount.google.com/inactive ఓపెన్ చేసి మన మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ ఇతరత్రా వివరాలను ధ్రువీకరించాల్సి ఉంటుంది.
✎ ఇక్కడ మన గూగుల్ అకౌంట్ ఎన్ని రోజుల పాటు ఓపెన్ చేయకుండా వదిలేస్తే ఇన్‌యాక్టివ్ అవ్వాలో సెట్ చేసుకోవచ్చు.
కనిష్టంగా 3 నెలల నుంచి గరిష్ఠంగా 18 నెలల పాటు అకౌంట్‌ను ఉపయోగించుకుండా వదిలేస్తే ఇన్‌యాక్టివ్ మోడ్‌లోకి వెళ్లేలా సెట్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత మన డేటాను ఎవరికి అయితే షేర్ చేయాలని అనుకుంటున్నామో వారి వివరాలను ఎంటర్ చేయాలి.
✎ ఎవరికైతే మన డేటా షేర్ చేస్తామో వారి మెయిల్ ఐడీ ఎంటర్ చేయగానే.. ఒక పాప్ అప్ వస్తుంది.
అందులో లాగ్ యాక్టివిటీ, గూగుల్ పే, గూగుల్ ఫొటోస్, చాట్, లొకేషన్ హిస్టరీ సహా గూగుల్‌కు సంబంధించిన అన్ని సర్వీసెస్ ఆప్షన్లు కనిపిస్తాయి.
వాటిలో మనం ఏ సమాచారాన్ని షేర్ చేయాలని అనుకుంటున్నామో.. ఆ సర్వీసెస్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
✎ ఒకసారి ఇన్‌యాక్టివ్ సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే మన గూగుల్ అకౌంట్ ఇన్‌యాక్టివ్ అవుతుందో..
అప్పుడు మనం ఇచ్చిన మెయిల్ ఐడీకి ఒక అలర్ట్ వెళ్తుంది.
ఆ మెయిల్ అలర్ట్ ద్వారా సదరు యూజర్ మన డేటాను చూడవచ్చు. అవసరమైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
✎ మెయిల్ ఇన్‌యాక్టివ్ అయిన తర్వాత ఆ డేటాను చూసేందుకు సదరు వినియోగదారుడికి 90 రోజుల గడువు మాత్రమే ఉంటుంది.
ఆ తర్వాత డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది.
ఎవరికీ యాక్సెస్ ఇవ్వకపోవడం..
గూగుల్‌లో స్టోర్ చేసిన డేటా మొత్తం మన వ్యక్తిగతం. కాబట్టి ఆ సమాచారాన్ని ఎవరూ చూడటం మీకు ఇష్టం లేకపోతే ఆ డేటా మొత్తం డిలీట్ అయ్యేలా చేసుకోవచ్చు.
దీనికోసం పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు.
డేటా షేరింగ్ కోసం మెయిల్ ఐడీని యాడ్ చేయకుండా.. పర్మినెంట్‌గా డేటా డిలీట్ అయ్యేలా ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఇలా చేస్తే గూగుల్ అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయిన మూడు నెలల తర్వాత డేటా మొత్తం ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతుం