Homeహైదరాబాద్latest Newsజర్నలిజం గురించి..ఇదేనిజం

జర్నలిజం గురించి..ఇదేనిజం

సమాజంలో జరుగుతోన్న పరిణామాలపై అవగాహన కల్పించడం జర్నలిజం బాధ్యత. ఒక వార్త ద్వారా ఎడ్యుకేట్ లేదా ఎంటర్‌టైన్ చేయగలుగుతారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో పత్రికా స్వేచ్చను అంతర్లీనంగా పేర్కొన్నారు. ప్రత్యేక హక్కులేవీ లేవు. ఫోర్త్ పిల్లర్‌గా ఉంటూ సమాజశ్రేయస్సు కోసం పాటుపడేది.

నిజానికి మీడియాతో సంచలనాలు క్రియేట్ చేసేది పెద్దగా ఏమీ ఉండదు. సంచలన విషయాలు వెలుగులోకి వస్తే ప్రచురిస్తారు. ప్రజెంట్ చేస్తారు. ఒక విషయాన్ని జరిగింది జరిగినట్లుగా ఇస్తే పాఠకుడు తనకు నచ్చిన విధంగా అర్థం చేసుకుంటాడు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే స్టోరీ ద్వారా ఎడ్యుకేట్ చేయగలరు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దినపత్రికలు, ఛానళ్లు ఏదో ఒక రాజకీయ పార్టీతో కుమ్మక్కై వ్యవహారాన్ని నడిపిస్తున్నాయి. తమవాళ్ల బాగోగుల కోసం అక్రమాలను దాచిపెడుతున్నారు. జర్నలిజం విలువలు మరుస్తున్నారు. పెద్దపెద్ద తలకాయలు సైతం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండటం సిగ్గుచేటు.

ధైర్యంగా వాస్తవాల్ని వెలుగులోకి తెస్తూ జనాన్ని చైతన్యపరిచే ప్రయత్నం ఇదేనిజం మీడియా చేస్తోంది. ఎంతటివారినైనా ఉపేక్షించే వీలు లేకుండా ఉన్నది ఉన్నట్టు సమాజానికి చేరవేస్తూ గొప్ప ప్రయత్నం జరుగుతోంది. ఇలా నిస్వార్థంగా పనిచేస్తోన్న ఇదేనిజం మీడియాను ఆదరించగలరని పాఠకులకు మనవి.

Recent

- Advertisment -spot_img