Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి.. ప్రయోజనాలెలా ఉంటాయి
Mutual Funds : స్టాక్ మార్కెట్ లలో మనం డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయకుండా నిపుణుల సారధ్యంలో మన పెట్టుబడిని వారిని పెట్టుబడి పెట్టమని చెప్పి మనం డబ్బులు ఇచ్చే చోటే మ్యూచువల్ ఫండ్స్ .
క్లుప్తంగా వివరణ :
మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ట్రస్ట్ లాంటిది, ఇది పరస్పర పెట్టుబడి లక్ష్యాన్ని పంచుకునే వివిధ పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరిస్తుంది.
ఈ ట్రస్ట్ ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ చేత నిర్వహించబడుతుంది.
మేనేజర్ ఈ నిధులను ఈక్విటీలు, స్టాక్స్ మరియు వివిధ మనీ మార్కెట్ సాధనాలలో పెట్టుబడి పెట్టడానికి సంపదను పెంచడానికి సహాయపడుతుంది.
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిలా కాకుండా, మ్యూచువల్ ఫండ్‌లు నిర్దిష్ట స్టాక్ లో పెట్టుబడులు పెట్టవు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి అనేక పెట్టుబడి ఎంపికలలో జరుగుతుంది.
తద్వారా పెట్టుబదిదరుడకి గరిష్ట లాభం లబిస్తుంది. పెట్టుబడిదారుడు పెట్టుబడి కోసం స్టాక్ లను తెసుకోవలిసిన అవసరం లేదు.
ఫండ్ మేనేజర్ ఆ స్టాక్ లను అత్యుత్తమ పనితీరు గల పెట్టుబడి ఎంపికలతో ఎంచుకొంటాడు, అది ఉత్తమమైన రాబడిని తెస్తుంది.
ప్రతి ఒక్కరూ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు, ఎందుకంటే అవసరమైన పెట్టుబడి మొత్తాలు నెలకు రూ .500 వరకు తక్కువగా ప్రారంభమవుతాయి.
రిస్క్‌కు విముఖత లేని మరియు నెలవారీ ప్రాతిపదికన కొద్ది మొత్తంలో పెట్టుబడితో వారి సంపదను పెంచుకోవాలనుకునేవారికి, ఇది సరైన ఎంపిక అని నిరూపించవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ ఎలా పని చేస్తుంది.
మ్యూచువల్ ఫండ్ మొదలుపెట్టాలి అంటే ముందు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ లేదా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (సెబి ) లో నమోదు చేసుకోవాలి.
అధికారంగా సెబి దగ్గర నుంచి అనుమతి పొందాలి.
అనుమతి పొందిన తర్వాత నుంచి వారు ప్రజలు దగ్గర నుంచి డబ్బులు పొందడానికి అర్హులు మరియు మ్యూచువల్ ఫండ్ మొదలుపెట్టాలి.
మీరు మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసినప్పుడు మీరు మీ డబ్బును ఇతర పెట్టుబడిదారులతో కలిసి మీ వాటాలు కొనుగోలు చేస్తారు.
ఎక్కువ మంది వాటాలు కొంటె కొత్త షేర్స్ జారి చేస్తారు. ఫండ్ ఎప్పటికి అప్పుడు వేరు వేరు పధకాలతో పెట్టుపడి పెడుతుంది.
దీని వలనా మనకి నష్టం అనేది చాలా తక్కువుగా ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్ స్కీం అనేది వేరు వేరు పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి వాటిని ప్రభుత్వ బాండ్ , ప్రవేట్ బాండ్ , లేదా ఇతర సెక్యూరిటీ బాండ్స్ తో షేర్ చేస్తుంది.
పెట్టుబడులు ఆఫర్ పత్రంలో వెల్లడించినట్లు గా పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి.
అందువల్ల, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకం ప్రధానంగా స్టాక్స్ పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెడుతుంది, అయితే డెట్ ఫండ్ తన ఆస్తులలో గణనీయమైన భాగాన్ని బాండ్లలో పెట్టుబడి పెడుతుంది.
మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడులని ఫండ్ మేనేజర్ నిర్వహిస్తాడు.
ఫండ్ మేనేజర్ రోజువారి సూచనలు నిర్వహిస్తారు. అందులో ఫండ్స్ ఎప్పుడు అమ్మాలి అనే దానిని నిర్ణస్తారు.
మ్యూచువల్ ఫండ్ మీ దగ్గర నుంచి డబ్బును మరియు వేరు పెట్టుబడిదారుల దగ్గర నుంచి తెసుకొన్న డబ్బుతో షేర్స్ కొనుగోలు చేస్తారు.
ఇక్కడ, ప్రతి మ్యూచువల్ ఫండ్ యూనిట్ యొక్క ధరను నికర ఆస్తి విలువ అంటారు.
సెబి (సెక్యూరిటీ ఎక్స్చేంజి బోర్డ్ అఫ్ ఇండియా ) కొన్ని వర్గాలుగా మ్యూచువల్ ఫండ్ ని వర్గికరించింది.
ఈక్విటీ ఫండ్స్ :
ఈక్వీటీ షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు గాను పెట్టుబడిదారుల నుంచి డబ్బుని సేకరించే ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్ అంటారు.
ఇవి చాలా ఎక్కువ రిస్క్‌తో కూడుకున్నవి. ఈ ఫండ్స్ వల్ల పెట్టుబడిదారులు కూడా ఎక్కువ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
ఎవరైతే పెట్టుబడిదారులు రిస్క్ తీసుకుంటారో వారికి మాత్రం ఖచ్చితంగా సరిపోయే ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్.
డెట్ ఫండ్స్ డెట్ ఫండ్స్ ఓపెన్ ఎండెడ్ కేటగిరీ ఫండ్స్ :
ఫండ్స్‌ల్లో ఎప్పుడైనా, ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఎప్పుడైనా, ఈ ఫండ్స్‌నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు.
కొన్ని డెట్ ఫండ్స్‌ల్లో మీకు అసలు నష్టాలే రావు.
ప్రభుత్వ సెక్యూరిటీస్, కార్పోరేట్ డెట్, బ్యాంకులు విడుదల చేసిన డెట్ స్కీమ్‌లలో డబ్బుని పెట్టుబడి పెట్టడాన్ని డెట్ ఫండ్స్ అంటారు.
ఎవరైతే పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరో అలాంటి వారికి డెట్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి.
బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ :
మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీల్లో పెట్టుబడులు చేయడానికి విభిన్నమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి.
ఆరునెలలు లేదా సంవత్సరం పాటు చిన్న మొత్తంతో బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మంచిది.
ఐదేళ్ళ కాలానికైతే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ కంటే లార్జ్‌క్యాప్ ఫండ్స్ అనువైనవి.
దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధికమించి రాబడులను అందించేది ఈక్విటీలు మాత్రమే.
మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్ మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్‌కు మరో పేరు లిక్విడ్ ఫండ్స్:
డిపాజిట్లు, ట్రెజరీ, పేపర్ల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బుని పెట్టుబడి పెట్టే ఫండ్స్‌ను మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్ అంటారు.
ఈ మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్ తక్కువ కాలం వ్యవధికి పెట్టుబుడులు పెడతారు.
గిల్ట్ ఫండ్స్ గిల్ట్ ఫండ్స్ అంటే సెక్యూరిటీ ఎక్కువగా ఉంటే ఫండ్స్:
గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో పెద్ద మొత్తంలో డబ్బుని మదుపు చేస్తారు.
ఈ డబ్బుని బ్యాంకింగ్ రంగంలో మదుపు చేయడం వల్ల మీ డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ :
ఐసిఐసిఐ ఫ్రుడున్షియల్ మ్యూచువల్ ఫండ్బి
బిర్లా మ్యూచువల్ ఫండ్
రిలయన్స్ మ్యూచువల్ ఫండ్
ఆక్సిస్ మ్యూచువల్ ఫండ్
హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్
ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్
సుందరం మ్యూచువల్ ఫండ్
ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్
టాటా మ్యూచువల్ ఫండ్
యుటిఐ మ్యూచువల్ ఫండ్
యల్ & టి మ్యూచువల్ ఫండ్
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్
కొటక్ మ్యూచువల్ ఫండ్ ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్
ఖ్వంటం మ్యచువల్ ఫండ్
డిఎస్పి బ్లాక్క్రాక్ మ్యూచువల్ ఫండ్
ఐడిబిఐ మ్యూచువల్ ఫండ్
బిఎన్పి పరిబాస్ మ్యూచువల్ ఫండ్
కెనరా రోబెకో మ్యూచువల్ ఫండ్
హెచ్ ఎస్ బి సి మ్యూచువల్ ఫండ్
బరోడా పొయినీర్ మ్యూచువల్ ఫండ్
టారస్ మ్యూచువల్ ఫండ్
మోతిలాల్ ఒస్వాల్ మ్యూచువల్ ఫండ్
బిఐఓ ఎ ఎక్స్ ఎ మ్యూచువల్ ఫండ్
ఎస్కార్ట్స్ మ్యూచువల్ ఫండ్