Skylab : అసలు ఈ స్కైలాబ్ ఏంటి.. మరి ఆ ప్రమాదమెలా తప్పింది..
Skylab – నాసా అంతరిక్షంలోకి పంపిన స్కైలాబ్ భూమ్మీద పడితే ఒక్కరు కూడా మిగలరని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు 1970వ దశకం చివరిలో.
ఇదే నేపథ్యంతో పినిమా రావడంతో మరోసారి స్కైలాబ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది.
స్పేస్ టెక్నాలజీలో అమెరికా రష్యాల మధ్య తీవ్ర పోటీ ఉండేది. స్పేస్ స్టేషన్ హక్కులు రష్యాకు మాత్రమే ఉండేవి.
దీంతో అమెరికా కూడా ఎలాగైనా తాము కూడ సొంత స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన చేసింది.
దీంతో సూర్యుడిపై పరిశోధనలు చేయడానికి స్కైలాబ్ ఏర్పాటు చేయాలని భావించింది.
1973 మే 14న స్కైలాబ్‌ను నాసా అంతరిక్షంలోకి పంపింది.
అయితే లాంచ్ చేసే సమయంలోనే వాతావరణంలోని మిల్లీమీటర్ సైజులో ఉండే ఒక శకలం స్కైలాబ్ స్టేషన్‌ను ఢీకొట్టింది.
దీంతో దానిలోని కొన్ని ప్యానెల్స్ దెబ్బతిన్నాయి. వ్యోమగాములు స్పేస్ ష్టేషన్‌కు వెళ్లి అక్కడ 28 రోజులు గడిపి సోలార్ ప్యానెల్‌ను సరిచేశారు.
నాసా అంచనా ప్రకారం ఐదు సంవత్సరాలు స్కైలాబ్ కక్ష్యలో ఉంటుందని భావించింది.
కానీ మెల్ల మెల్లగా స్కైలాబ్ తన కక్ష్యను కోల్పోతూ వచ్చింది.
ఇక చేసేదేమీ లేక స్కైలాబ్ భూమిపై పడనుందని అమెరికా అన్ని దేశాలను అప్రమత్తం చేసింది.
1979లో జూలై 10 నుంచి జూలై 14 లోపు సౌతాఫ్రికాకు వెయ్యి కిలోమీటర్ల సమీపంలో సముద్రంలో పడనుందని నాసా అంచనా వేసింది.
భారత కాలమానం ప్రకారం జూలై 11 రాత్రి భూమి వైపు రావడం మొదలైంది.
స్కైలాబ్ ఒకవేళ జనావాసాల మీద పడితే లక్షకు పైగా మరణాలు సంభవించే అవకాశం ఉందని నాసా భావించింది.
అయితే అది కాస్తా హిందూ మహాసముద్రంలో పడింది.. ఎవరికీ ప్రమాదం జరగలేదు.
దాంతో నాసా ఊపిరిపీల్చుకుంది.