తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రాయలసీమలో సాధారణ (37 లక్షల ఎకరాలు) కంటే 15 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉలవ, పెసర, అలసందలు, జొన్న, మినుము, కొర్ర, సజ్జలను 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనుంది. ఇందుకోసం రూ.65 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 8 జిల్లాల రైతులకు 69వేల క్వింటాళ్ల విత్తనాలు అందించనుంది.