Homeహైదరాబాద్latest Newsఆ వ్యాఖ్యల వెనుక అసలు రహస్యం ఏంటి.. సమంత రెండో పెళ్లి చేసుకోనుందా..?

ఆ వ్యాఖ్యల వెనుక అసలు రహస్యం ఏంటి.. సమంత రెండో పెళ్లి చేసుకోనుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయంతో జనాలని ఆకట్టుకుంటుంది. సమంత నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్ హనీ బన్నీ’ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ సందర్భంగా చేసిన సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. ‘హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లో సమంత తల్లి పాత్ర పోషించింది. ఆ పాత్ర గురించి సమంత మాట్లాడుతూ.. ‘నాకు తల్లి కావాలనే కలలు ఉన్నాయి. అమ్మగా ఉండటానికి ఇష్టపడతాను. ఇందుకు ఆలస్యమైందని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతం నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను అని చెపింది. అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందా..? అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

Recent

- Advertisment -spot_img