ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉపాధ్యాయుడు చేసిన పనికి ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు జిల్లా మెజిస్ట్రేట్ రాజేంద్ర పన్సియా తనఖీలు నిర్వహించడానికి వెళ్లారు. అక్కడ విద్యార్థుల కాపీస్‌లో మొదటి నుంచి చివరి పేజీ వరకూ అనేక తప్పులను ఆయన గమనించారు. అప్పుడు ఆయన ఉపాధ్యాయులను పిలిపించి.. ఆ విషయంపై ప్రశ్నించారు. అనంతరం టీచర్ల ఫోన్లను పరిశీలించారు.
ఈ క్రమంలోనే.. ప్రియమ్ గోయల్ అనే ఓ టీచర్ బండారం బట్టబయలైంది. అతని ఫోన్‌లోని ఎన్ని గంటలు వాడారో చూపించే యాప్ లో చూడగా..పాఠశాల సమయంలో దాదాపు రెండు గంటల పాటు క్యాండీ క్రష్ ఆడుతూ గడిపాడని చూపించింది. అంతేకాదు.. 26 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడాడని, 30 నిమిషాల పాటు సోషల్ మీడియా యాప్స్ చూస్తూ గడిపాడని తేలింది. దీనిని విద్యాశాఖ తీవ్రంగా పరిగణిస్తూ.. ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది.