కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటం ఎవ్వరం మరచిపోలేము. అలాగే 10 సంవత్సరాలు ముఖ్యమంతిగా ఉండి రాష్ట్రాన్ని ఎవ్వరూ ఊహించనంతగా అభివృద్ధి చేశాడు. కేసీఆర్ మాట వింటే ప్రత్యర్థుల గుండెల్లో భయం పుట్టేది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు నాలుగు నెలల నుంచి తీహార్ జైలులో ఉన్న తన కూతురు కవితను ఎందుకు పరామర్శించడం లేదు?. అయితే ఈ ప్రశ్న ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. కేటీఆర్, హరీష్, కవిత భర్త, కేసీఆర్ భార్య అంటే కవిత తల్లి ఇప్పటికే చాలా సార్లు తీహార్ జైలులో ఉన్న కవితను కలిశారు. అలాగే కవితను పార్టీకి చెందిన పలువురు కలిసి వస్తున్నారు.కానీ కేసీఆర్ మాత్రం ఇంకా పరామర్శించనికి రాలేదు.
అయితే తాజాగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో జైలు అధికారులు హాస్పటల్‌కు తరలించారు. అయితే ఈ వార్త విని ఈసారి కవితను చూసేందుకు కేసీఆర్ వెళతారని చాలా మంది అనుకున్నారు.. కానీ ఆయన రాలేదు.. కేసీఆర్ రాకపోడానికి కారణం ఏమిటి? కేసీఆర్ కు బిడ్డపై ప్రేమ లేదా? లేక ఆమె వల్ల తన పరువు పోతుందని కోపంగా ఉన్నారా ? అనే ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశమైంది. అయితే అసలు కారణం కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది ఏంటంటే.. నిజానికి కేసీఆర్ కి కవిత అంటే వల్ల మాలిన ప్రేమ.. నిజానికి కవిత జైలుకు వెళ్లడం వల్ల కుటుంబంలో అందరికంటే కేసీఆర్ ఎక్కువ విలవిలాడుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ కేసీఆర్ వెళ్తే కవిత మరింత భావోద్వేగానికి గురవుతారని.. వెళ్తే కవిత మరింత భాధ పడుతుందని భావించి కుటుంబ సభ్యులంతా కేసీఆర్ ని వెళ్లకుండా ఆపుతున్నారని తెలుస్తుంది.