– వ్యక్తిగత భేటీనా? వ్యవస్థీకృత భేటీనా?
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఇదేనిజం, అమరావతి: పారిశ్రామికవేత్త అదానీ.. ఏపీ సీఎం జగన్ భేటీ వెనక మర్మమేమిటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. వీరిద్దరూ వ్యక్తిగతంగా భేటీ అయ్యారా? లేక వ్యవస్థీకృతంగా భేటీ అయ్యారా? అని ప్రశ్నించారు. గతంలో కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చే పేరుతో అదానీ జగన్‌తో 4 గంటలపాటు భేటీ అయ్యారని గుర్తు చేశారు.
ఏపీలో ఇప్పటికే గంగవరం, కృష్ణపట్నం పోర్టులను, సోలార్ విద్యుత్ ఒప్పందాలను అదానీ కంపెనీకే అప్పగించారు. ఏపీలో స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లు కూడా అత్యంత భారీ ధరకు అదానీకే కట్టబెట్టారు. జగన్, అదానీల భేటీ వెనుక మర్మమేంటి?’’ అని రామకృష్ణ ప్రశ్నించారు.