కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం అందరికీ అమలు కావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారికి ఉచిత కరెంట్ ఇస్తామంది. అయితే రేషన్ కార్డు లేదని, సర్వీస్ నెంబర్ తప్పు ఎంటర్ చేయడం తదితర కారణాలతో చాలామంది జీరో విద్యుత్ అమలు కావడం లేదు. ఒకనెల జీరో బిల్లు విద్యుత్ అందితే..మరో నెల అదే మీటరు మీద 200 మీటర్లలోపు వాడిన కరెంట్ బిల్లు వస్తోందని వినియోగదారులు మొత్తుకుంటున్నారు. పేరుకే పథకాలు కానీ ఎవరికి సరిగా అందట్లేదు అని నెటిజన్లు రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.