సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. వైసీపీ పార్టీ నేతలు ఎలాంటి వారికి మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు.కొన్ని పోస్టులు దారుణంగా ఉన్నాయని అన్నారు. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనపై తప్పుడు ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆ పోస్టులను తొలగించారు. అయినా వారిని వదిలేది లేదు.. వారిపై కేసులు నమోదు చేస్తాం అని పేర్కొన్నారు. ఆడవారిని ఏదైనా అంటే రాయలసీమ ప్రజలు సహించరు. సొంత తల్లిని, చెల్లిని తిట్టిన వారిని జగన్ ఏం చేయలేకపోయారు. మీ తల్లిని, చెల్లిని తిట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నాం అని హోంమంత్రి అన్నారు.