Homeహైదరాబాద్latest Newsఏం మనిషివిరా నువ్వు.. భార్య కాళ్లను బైక్ కు కట్టేసీ ఈడ్చుకెళ్లిన దుర్మార్గుడు.. వీడియో వైరల్..!

ఏం మనిషివిరా నువ్వు.. భార్య కాళ్లను బైక్ కు కట్టేసీ ఈడ్చుకెళ్లిన దుర్మార్గుడు.. వీడియో వైరల్..!

ఇదేనిజం, నేషనల్ బ్యూరో : తాగిన మైకంలో ఓ భర్త తన భార్యపై క్రూరంగా ప్రవర్తించాడు. తన భార్య కాళ్లకు తాడు కట్టి దాన్ని బైక్‌కు లాక్కెళ్లాడు. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మట్టి, రాళ్లతో ఉన్న రోడ్డులో మహిళను ఈడ్చుకెళ్తుంటే ఆమె నొప్పితో సాయం కోసం కేకలు వేసింది. అయినా ఆ ముర్ఖుడు పట్టించుకోలేదు. దీన్ని ఆపేందుకు ఒక్కడు కూడా ముందుకు రాలేదు. మహిళను కొంతదూరం లాక్కెళ్లిన తర్వాత అతడు బైక్‌ దిగి ఏదో సాధించినట్లు నడుం మీద చేయి వేసి దర్జాగా నిల్చొని ఉన్నాడు. కాగా, ఈ ఘటన దాదాపు నెలరోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, జైసల్మేర్‌లో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లాలని భార్య అనుకోగా, భర్త ఆమెపై ఈ విధంగా దాడి చేసినట్లు సమాచారం. సదరు వ్యక్తి ప్రేమ్‌ రామ్‌ మేఘ్‌వాల్‌గా(32) పోలీసులు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మేఘ్‌వాల్‌ కొంత కాలంగా డ్రగ్స్‌‌కు బానిసైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధిత మహిళ పంజాబ్‌లోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img