ఇదే నిజం, కుత్బుల్లాపూర్: కెసీఆర్ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అనంతరం 129 – సూరారం కాలనీ డివిజన్ టీఎస్ఐఐసి కాలనీలో జరిగిన చేరికల కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు, టీఎస్ఐఐసి కాలనీ మాజీ అధ్యక్షులు నేతి రాజు, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఆర్ఎస్ కండువాను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హామీలను మించి అభివృద్ధి చేశామని, కానీ నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని కుంటు పరిచాయన్నారు. రానున్న రోజుల్లో కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, నాయకులు చెక్క సురేష్ బాబు, సాయిబాబా, రోషన్, రహమాన్, సాంబశివరావు, జనార్దన్ రెడ్డి, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.