Homeహైదరాబాద్latest Newsభార్యాభర్తలలో ఒకరు శృంగారంపై ఆసక్తి చూపకపోతే ఏం చేయాలంటే..?

భార్యాభర్తలలో ఒకరు శృంగారంపై ఆసక్తి చూపకపోతే ఏం చేయాలంటే..?

భార్యాభర్తలలో ఒకరికి లైంగిక కోరికలు తగ్గవచ్చు. దంపతులు ఈ విషయంలో ఒక అవగాహనతో ఉండాలి. కొన్నిసార్లు మేల్ పార్ట్‌నర్‌లో లైంగిక కోరిక తగ్గవచ్చు, అదే సమయంలో ఫిమేల్ పార్ట్‌నర్‌ లైంగిక కోరిక ఎక్కువ అవ్వచ్చు. ఇద్దరిలో ఎవరికి ఇంట్రెస్ట్ తగ్గినా మళ్లీ సెక్స్ డ్రైవ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దంపతుల మధ్య అన్యోన్యమైన అనుబంధానికి శృంగారం జీవితం బాగుండటం ముఖ్యం. అయితే అలంటి సమయంలో ఏం చేయాలో తెలుసుకుందాం..

  • భాగస్వామితో మాట్లాడటం
    లైంగికంగా కలవాలని బాగా అనిపిస్తుంటే భాగస్వామితో దాని గురించి మాట్లాడటం ముఖ్యం. పార్ట్‌నర్ ఆసక్తిని చూపించకపోతే ఎందుకు, ఏమైంది అని ఆరా తీయాలి. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి కోప్పడకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. పార్ట్‌నర్ రిలాక్స్‌డ్‌గా ఉన్నప్పుడే దీని గురించి మాట్లాడటం మంచిది. వారు చెప్పే మాటలు, ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి. ఇద్దరూ సంతృప్తి చెందే పరిష్కారాన్ని కనుగొనాలి.
  • చెవిలో అలాంటి పదాలు చెప్పడం
    భాగస్వామి చెవిలో లైంగిక కోరికలను పెంచే మాటలు చెప్పాలి. సెక్సువల్ వర్డ్స్ లేదా ఫ్రెజ్‌లతో హింట్ ఇవ్వాలి. ఫీలింగ్స్ రేకెత్తించడానికి ఇంతకంటే ఉత్తమ మార్గం మరొకటి ఉండదు.
  • కలిసి స్నానం చేయడం
    దంపతులు ఇద్దరూ కలిసి స్నానం చేస్తే ఒకరిపై ఒకరికి లైంగిక కోరికలు పెరుగుతాయి. దీనివల్ల రెట్టింపు మూడ్‌తో సెక్స్ లైఫ్ బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.
  • ఘాటైన ముద్దు
    పార్ట్‌నర్‌లో కోరికలను రగిలించాలంటే చాలా ఇష్టంగా, ఘాటుగా, ఎక్కువసేపు ముద్దు ఇవ్వాలి. మౌత్-టు-మౌత్ కిస్సింగ్ చేస్తే లైంగిక కోరికలు పెరుగుతాయి. దీనికి కారణం ఆ సమయంలో ఒకరి లాలాజలం మరొకరి నోట్లోకి ప్రవేశించడమే. లాలాజలంలో టెస్టోస్టెరాన్ ఉంటుంది, ఇది సెక్స్ చేయాలని కోరికలను బాగా పెంచేస్తుంది. ముద్దులు పెట్టుకుంటుంటే బాడీలో డొపమైన్, ఆక్సిటోసిన్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి బంధం, అనుబంధాన్ని పెంపొందిస్తాయి.
  • పార్ట్‌నర్ వీక్ స్పాట్స్
    మగ, ఆడవారి ఇద్దరి శరీరంలోనూ సెక్స్‌కు ప్రేరేపించే సున్నితమైన ప్రాంతాలు (Erogenous zones) ఉంటాయి. ఆ స్పాట్స్‌లో టచ్ చేస్తే పార్ట్‌నర్‌కు ఫీలింగ్స్ పెరుగుతాయి. అయితే మంచి మూడ్‌లో, ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని టచ్ చేయాలి. ఏ భాగాన్ని టచ్ చేసే పార్ట్‌నర్‌ వెంటనే మరింత మూడ్‌లోకి వెళ్లిపోతారో తెలుసుకోవాలి. ఇందుకు ఆ కామన్ స్పాట్స్‌ ఏవో తెలుసుకొని ఒక్కో చోట టచ్ చేస్తూ టెస్ట్ చేసుకోవాలి.
  • వైద్యుల సలహాలు
    భాగస్వామిలో లైంగిక కోరిక తగ్గడానికి కొత్తగా వాడుతున్న మందులు కారణం కావచ్చు. యాంటీడిప్రెసెంట్లు, రక్తపోటు మందులు, హార్మోన్ థెరపీ, క్యాన్సర్ చికిత్సలు తీసుకుంటూ ఉంటే కూడా లైంగిక కోరికలు తగ్గవచ్చు. చాలా కాలం పాటు దంపతుల్లో ఒకరు లేదా ఇద్దరూ సెక్స్‌కు దూరంగా ఉంటుంటే.. అందుకే ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు వైద్యులను సంప్రదించడం మంచిది.

Recent

- Advertisment -spot_img