ఇదే నిజం, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు తెలంగాణ భవన్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా మెట్పల్లి పెద్దాపూర్ గురుకులంలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు అనుమానస్పదంగా మరణించడం జరిగింది. ఇద్దరు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా గురుకులాలు, వసతి గృహాల పైన పట్టించుకున్న పాపాన పోలేదని విద్యాశాఖ మంత్రి లేకపోవడం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం వలన ఈ 15 రోజుల వ్యవధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు విద్యార్థులు మరణించడం చాలా బాధాకరమన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మర్రిమడ్లకు చెందిన ఆరవ తరగతి చదువుతున్న ఎడ్యుల అనిరుద్ అనుమానాస్పదంగా మరణించడం జరిగిందని. ఒక్కగానొక్క బిడ్డ మరణించడం పట్ల వారి తల్లి తీవ్ర శోకసంద్రంలో మునిగారని, ఇన్ని అనుమానాస్పద మరణాలు జరుగుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని, దీనికి కారణమైన అధికారులను విధుల నుండి తొలగించాలని, వారి మరణాలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం హాజరిగింది. వసతి గృహాల్లో సరియైన మౌలిక సదుపాయాలు లేక అధికారుల అలసత్వం పాలకుల చోద్యం వలన ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయన్నారు.
విద్యార్థి మరణానికి పూర్తిగా ఈ ప్రభుత్వం బాధ్యత వహించి వారికి న్యాయం జరిగేలా చూడాలని, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా వసతి గృహాల్లో కమిటీలను వేసి విద్యార్థులకు సరియైన న్యాయం చేయాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలను సందర్శించడం జరుగుతుందని. విద్యార్థులకు ఏమైనా అసౌకర్యాలు కలిగితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మట్టే శ్రీనివాస్, నాయకులు కోడంవెంకటేష్, వావిలాల సాయి, కోడి రోహిత్, మూడం సాయి, అరవింద్, కస్తూరి సాయి, తదితరులు పాల్గొన్నారు.