ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్.. తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకునే వారిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తాజాగా కొన్ని భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. ఈ మేరకు ఏప్రిల్ నెలకి సంబంధించిన నెలవారీ నివేదికను విడుదల చేసింది. 71,82,000 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించినట్లు మెటా మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెల్లడించింది. ఈ వ్యక్తులు యాప్‌ను దుర్వినియోగం చేశారని పేర్కొంది.