Homeహైదరాబాద్latest NewsWhatsApp : బస్సు ప్రయాణీకులకు శుభవార్త.. ఇకపై వాట్సాప్ ద్వారానే టికెట్ బుక్..!!

WhatsApp : బస్సు ప్రయాణీకులకు శుభవార్త.. ఇకపై వాట్సాప్ ద్వారానే టికెట్ బుక్..!!

WhatsApp : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ (WhatsApp) ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో వాట్సాప్ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లోకి ఎక్కించేందుకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని దూర ప్రాంతాల బస్సు సర్వీసులలో వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. బస్సులో టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకునే వినియోగదారులు ముందుగా వాట్సాప్ ద్వారా 9552300009 నంబర్‌కు ‘హాయ్’ అని మెసేజ్ పంపాలి. అందుబాటులో ఉన్న సేవల జాబితా వెంటనే కనిపిస్తుంది. అందులో, RTC టికెట్ బుకింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ బుకింగ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత, బయలుదేరే స్థానం, గమ్యస్థానం, తేదీ వంటి వివరాలను నమోదు చేస్తే, అందుబాటులో ఉన్న సేవలు ప్రదర్శించబడతాయి. వాటిలో సీట్లను ఎంచుకుని ఆన్‌లైన్ లేదా డిజిటల్ చెల్లింపులు చేయాలి. వెంటనే, టికెట్ పంపబడుతుంది. వాట్సాప్‌లో వచ్చిన టికెట్‌ను చూపించడం ద్వారా ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణించవచ్చు అని అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img