Homeహైదరాబాద్latest Newsవాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌.. ఇక నుంచి వీడియో కాల్‌ లో 10 రకాల ఫిల్టర్లు..!

వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌.. ఇక నుంచి వీడియో కాల్‌ లో 10 రకాల ఫిల్టర్లు..!

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌ సాయంతో వీడియో కాల్‌ సమయంలో నచ్చినట్లుగా స్క్రీన్‌ను మార్చుకొనే అవకాశం ఉంటుంది. ఫిల్టర్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌లో నచ్చిన థీమ్‌ను సెట్‌ చేసుకోవచ్చు. మొత్తం 10 రకాల ఫిల్టర్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని వాట్సాప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో పంచుకుంది.

Recent

- Advertisment -spot_img