ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. వాట్సాప్‌లోని కమ్యూనిటీ గ్రూపుల కోసం ‘రీసెంట్ కమ్యూనిటీ మీడియా’ ఫీచర్ రాబోతోంది. దీంతో గ్రూప్‌లలో ఇటీవల షేర్ చేసిన మీడియా ఫైల్‌లను ప్రత్యేక విభాగంలో ఆయా గ్రూప్‌ల సభ్యులు సులభంగా వీక్షించవచ్చు. ఇది ఫైల్ పరిమాణాన్ని కూడా చూపుతుంది. ఇది అవసరం లేని పెద్ద ఫైల్‌లను గుర్తించడానికి మరియు తొలగించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా స్టోరేజ్ స్పేస్ పెరుగుతుంది.