Whatsapp Ban : త్వరలో లక్షల అకౌంట్లు బ్యాన్.. మీది అవ్వకూడదంటే
Whatsapp Ban – ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్‌కు చెందిన 20 లక్షల వాట్సప్ అకౌంట్లను బ్యాన్ చేసింది.
అక్టోబర్ 2021లో ఈ అకౌంట్లను వాట్సప్ సంస్థ బ్యాన్ చేసింది.
అంటే..ఈ అకౌంట్లు ఓపెన్ కావు.
ఆయా అకౌంట్లకు మెసేజ్‌లు పంపించినా వెళ్లవు.
ఆ అకౌంట్ల నుంచి కూడా మెసేజ్‌లు వెళ్లవు.
నిజానికి.. అంతకుముందే 30.27 లక్షల ఇండియన్ వాట్సప్ అకౌంట్లను సంస్థ బ్యాన్ చేసింది.
వాట్సప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ యూజర్లు ఉన్నది ఇండియాలోనే.
దేశంలో అతి పెద్ద మెసేజింగ్ యాప్ కూడా ఇదే.
ఇండియాలో వచ్చిన సరికొత్త ఐటీ రూల్స్‌లో ఉన్న డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021 ప్రకారం వాట్సప్ అకౌంట్లను ఎప్పటికప్పుడు బ్యాన్ చేస్తూ ఉంటుంది.
ఫేక్ న్యూస్‌ను విపరీతంగా వైరల్ చేయడం కోసం ఇతర వాట్సప్ అకౌంట్స్, గ్రూప్‌లకు పంపించేవాళ్ల అకౌంట్లు, స్పామ్ మెసేజ్‌లు పంపించే అకౌంట్లు, అల్లర్లు చెలరేగేలా మెసేజ్‌లు పంపించడంపై చాలా రోజుల నుంచి వాట్సప్ నిఘా పెట్టింది.
ఇలా వాట్సప్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్(Terms of Service) రూల్స్‌ను బ్రేక్ చేసిన అకౌంట్లను వాట్సప్ ఎప్పటికప్పుడు బ్యాన్ చేస్తుంటుంది.
వాట్సప్.. అకౌంట్‌ను బ్యాన్ చేయకుండా ఉండాలంటే.. ఖచ్చితంగా ఈ 8 రూల్స్‌ను పాటించాల్సిందే.
లేకపోతే.. ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా అకౌంట్ బ్యాన్ అవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేరే వ్యక్తి పేరుతో అకౌంట్ క్రియేట్ చేసినా.. వాళ్లలా ప్రవర్తించి.. అవతలి వారికి మెసేజ్‌లు పంపించినా.. వాట్సప్ వెంటనే ఆయా అకౌంట్లను బ్యాన్ చేస్తుంది.
దాన్నే ఇమ్‌పర్సోనేషన్(impersonation) అంటారు.
మీ కాంటాక్ట్స్ లిస్ట్‌లో లేని వాట్సప్ నెంబర్‌కు పదే పదే మెసేజ్‌లు చేసినా.. స్పామ్ మెసేజ్‌లు పంపించినా.. వాట్సప్ మీ అకౌంట్‌ను బ్యాన్ చేస్తుంది.
చాలామంది వాట్సప్ పేరుతో ఉన్న థర్డ్ పార్టీ యాప్స్‌ను కూడా ఉపయోగిస్తుంటారు.
WhatsApp Delta, GBWhatsApp, WhatsApp Plus లాంటి యాప్స్ ఉపయోగించి వాట్సప్ చాట్ చేస్తుంటారు.
నిజానికి ఇవి వాట్సప్ అఫిషియల్ యాప్స్ కావు.
కాబట్టి.. ప్రైవసీ సమస్యలు వస్తాయని.. ఈ యాప్స్ వాడే అకౌంట్లను వాట్సప్ వెంటనే బ్యాన్ చేస్తుంది.
చాలామంది తన వాట్సప్‌లో మీ వాట్సప్ నెంబర్‌ను బ్లాక్ చేసినా కూడా వాట్సప్ మీ అకౌంట్‌ను బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది.
మీ కాంటాక్ట్స్ లిస్టులో ఉన్నవాళ్లు అయినా లేని వాళ్లు అయినా.. ఎక్కువమంది బ్లాక్ చేస్తే.. మీ అకౌంట్ పర్మినెంట్‌గా బ్యాన్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
చాలామంది వాట్సప్ యూజర్లు.. మీ వాట్సప్ అకౌంట్‌ను రిపోర్ట్ చేసినా.. మీ అకౌంట్ బ్యాన్ అయ్యే చాన్సెస్ ఉంటాయి.
సైబర్ క్రిమినల్స్.. వాట్సప్ చాట్ ద్వారా.. మాల్వేర్, ఫిషింగ్ లింక్స్ పంపిస్తుంటారు.
ఏపీకే ఫైల్స్ ఫార్మాట్‌లో మాల్వేర్‌ను పంపించినా.. డేంజరస్ ఫిషింగ్ లింక్స్‌ను వాట్సప్‌లో ఫార్వర్డ్ చేసినా వాట్సప్ మీ అకౌంట్‌ను బ్యాన్ చేసే ప్రమాదం ఉంటుంది.
అసభ్యకరమైన వీడియోలు, చట్టానికి వ్యతిరేకమైన మెసేజ్‌లు, బెదిరింపులు, వేధింపులు, ఒకరి పరువుకు భంగం కలిగే మెసేజ్‌లు, ద్వేషపూరితమైన మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసినా వాట్సప్ మీ అకౌంట్‌ను బ్యాన్ చేస్తుంది.
ఫేక్ మెసేజ్‌లు, వీడియోలు కంటిన్యూగా ఫార్వర్డ్ చేస్తూ ఉండటం అనేది హింస, అల్లర్లు చెలరేగడానికి ఆజ్యం పోసినట్టు అవుతుంది.
అందుకే.. అలాంటి అకౌంట్లను కూడా వాట్సప్ పర్మినెంట్‌గా బ్యాన్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి
వాట్సప్ బిజినెస్ అకౌంట్‌లో సరికొత్త ఫీచర్..
వాట్సాప్ వాడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే
పాన్ కార్డ్ అప్లై చేయడానికి ఉత్తమ, సులువైన సైట్ ఏది.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
Car Codes రకాలను తెలిపే LXI, VXI, ZXI వంటి పదాల మధ్య తేడా ఏంటి..