Whatsapp : వాట్సప్ యాప్ మన జీవితంలో ఇది ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. మనం పొద్దున లేచిన అప్పుడు నుండి రాత్రి పడుకునే వరుకు వాట్సప్ ను ఉపయోగించాల్సిందే. ఈ క్రమంలో వాట్సాప్ తన యూజర్స్ కోసం మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై వాట్సాప్ యూజర్లు తమ వాట్సప్ స్టేటస్‌కి మ్యూజిక్‌ని యాడ్ చేసుకోవచ్చు. Instagram లాగానే, మీరు స్టేటస్ ఫోటోలు మరియు వీడియోలకు సంగీతాన్ని జోడించవచ్చు. అయితే ఇందులో సెలెక్టెడ్ ట్రాక్స్ మాత్రమే ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్‌ను ప్రకటిస్తూ వాట్సాప్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.