స్మార్ట్ ఫోన్లలో ఇప్పుడు వాట్సాప్ ( WhatsApp ) ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది. మెసేజ్‌లు చేయడం దగ్గర నుంచి ఫొటోలు, వీడియోలు పంపించడానికి అన్నింటికీ వాట్సాప్‌నే వాడుతున్నారు.
పేమెంట్స్ బ్యాంకింగ్‌లోనూ వాట్సాప్ సేవలు అందిస్తోంది. రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ యాప్‌లో వాట్సాప్ ఎప్పుడూ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంది.
వీటిలో కొన్ని ఫీచర్ల గురించి చాలామందికి తెలియనే తెలియదు. అలాంటి వాట్సాప్ ట్రిక్స్ మీకోసం..
స్టార్ మెసేజెస్
వాట్సాప్‌లో రోజుకు బోలెడన్ని మెసేజ్‌లు వస్తుంటాయి. ఒక్కోసారి మనకు అవసరమైన సమాచారం కూడా వస్తుంది.
అయితే మనకు కావాల్సిన మెసేజ్ తిరిగి చూడాలనుకుంటే వెంటనే దొరకదు. చాట్‌లో ఎంత వెతికినా ఒక్కోసారి టైంకి కనిపించదు.
అందుకే ముఖ్యమైన మెసేజ్‌లను వెంటనే తిరిగి చూసుకునేందుకు స్టార్‌డ్ మెసేజెస్ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది.
ఇందులో మెసేజ్ సేవ్ చేయడం కూడా సులువే. ఏదైనా మెసేజ్ వద్ద కనిపించే స్టార్ బటన్‌పై క్లిక్ చేస్తే.. అది స్టార్‌డ్ మెసేజెస్‌లోకి వెళ్తుంది.
సెట్టింగ్స్‌లోని స్టార్డ్‌డ్ మెసేజెస్‌లోకి వెళ్లి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మెసేజ్‌ను చూసుకోవచ్చు
వాట్సాప్ స్టోరీజి ఇలా ఫ్రీ చేసుకోండి
వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లు, మీడియా ఫైల్స్‌తో ఫోన్ మెమొరీ మొత్తం నిండిపోతుంటుంది. దీంతో ఒక్కోసారి స్టోరేజి సమస్య తలెత్తుతుంది.
అందుకే అన్ని మీడియా ఫైల్స్‌ను సేవ్ చేసుకోకుండా.. ఎప్పటికప్పుడు డిలీట్ చేయాలి.
ముఖ్యంగా ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్స్‌ను ముందుగా డిలీట్ చేయాలి. ఇందుకోసం ప్రతి చాట్ ఓపెన్ చేసి సైజ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు.
వాట్సాప్ సెట్టింగ్స్‌లోని స్టోరేజి అండ్ డేటాపై క్లిక్ చేస్తే.. సైజ్‌ల వారీగా ఫైల్స్ జాబితా కనిపిస్తుంది.
మేనేజ్ స్టోరేజిపై క్లిక్ చేస్తే 5ఎంబీ కంటే ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్స్‌ను ముందు చూపిస్తుంది.
అందులో అవసరం లేని ఫైల్స్‌ను డిలీట్ చేయడం ద్వారా స్టోరేజి సమస్య నుంచి బయటపడొచ్చు.
చాట్ ఓపెన్ చేయకుండా మెసేజ్ చదవడమెలా
వాట్సాప్ చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ మొత్తం చదివేయొచ్చు. ఇందుకోసం ముందుగా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయాలి.
తర్వాత కర్సర్‌ను మనకు వచ్చిన మెసేజ్‌పై ఉంచాలి. అలా కొద్దిసేపు ఉంచగానే.. మెసేజ్ మొత్తం పాప్ అప్‌లా కనిపిస్తుంది.
ఇలా మెసేజ్ చదివిన విషయం.. అవతలివారికి తెలియదు కూడా.
ఎదుటివారికి తెలియకుండా మెసేజ్ చూడటమెలా
అవతలి వ్యక్తి పెట్టిన స్టేటస్‌ను వాళ్లకు తెలియకుండా చూడొచ్చని మీకు తెలుసా.
ఇందుకోసం వాళ్ల స్టేటస్ చూడటానికి ముందు రీడర్ రిసిప్ట్ డిసేబుల్ చేయాలి. అప్పుడు మనం స్టేటస్ చూసినట్టు అవతలి వ్యక్తికి తెలియదు.
ఈ ఫీచర్‌ను డిసేబుల్ చేయడం వల్ల మీ స్టేటస్ ఎవరు చూశారో కూడా మీరు తెలుసుకోలేరు.
రీడర్ రిసిప్ట్ డిసేబుల్ చేయడం ద్వారా అవతలి వ్యక్తి పంపిన మెసేజ్ మీరు చూసిన విషయం కూడా వారికి తెలియదు.
అలాగే మీరు పంపిన మెసేజ్ అవతలి వ్యక్తి చూశాడో లేదో కూడా మనం తెలుసుకోలేం.
ఆఫీసులో వాట్సాప్ వెబ్ లాగిన్ అయి మర్చిపోయారా
ఆఫీసులో ఉన్నప్పుడు చాలామంది వాట్సాప్ వెబ్ ఓపెన్ చేస్తుంటారు. ఒక్కోసారి హడావుడిలో లాగౌట్ చేయడం మరిచిపోయి ఇంటికి వచ్చేస్తారు.
అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. మొబైల్‌లోని వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి వాట్సాప్ వెబ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
అందులో మనం ఏయే కంప్యూటర్లలో లాగిన్ అయ్యామనే లిస్ట్ కనిపిస్తుంది. ఆ జాబితాలో ఒక దానిపై క్లిక్‌చేయాలి.
అక్కడ లాగౌట్ అని ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే వాట్సాప్ వెబ్ నుంచి లాగౌట్ అయిపోతారు.
టైప్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ పంపొచ్చు
టైప్ చేయడానికి బదులు గూగుల్ అసిస్టెంట్ లేదా సిరి యాప్ ద్వారా మెసేజ్‌లు పంపియొచ్చు.
ఇందుకోసం ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్‌లో అయితే గూగుల్ అసిస్టెంట్, ఐఫోన్‌లో అయితే సిరి యాప్ని యాక్టివేట్ చేయాలి.
సెండ్ వాట్సాప్ మెసేజ్ అని చెప్పాలి. ఆ తర్వాత ఎవరికి మెసేజ్ పంపించాలి? ఏమని పంపించాలో చెప్పి సెండ్ అని చెప్తే మెసేజ్ వెళ్లిపోతుంది.
కాంటాక్ట్‌లో లేని నంబర్‌కు మెసేజ్ చేయడమెలా?
సాధారణంగా కాంటాక్ట్స్‌లో ఉన్న ఫోన్ నంబర్లకే వాట్సాప్ మెసేజ్ పంపించడానికి కుదురుతుంది.
అయితే నంబర్ సేవ్ చేసుకోకుండా కూడా మెసేజ్ పంపించేందుకు ఒక ట్రిక్ ఉంది.
ఇందుకోసం ముందుగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి https:/api.whatsapp.com/send?phone=xxxxxxxxxx(పది అంకెల ఫోన్ నంబర్) టైప్ చేయాలి.
అనంతరం ఎంటర్ చేయగానే వాట్సాప్‌లోకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఆ నంబర్‌కు మెసేజ్ పంపించవచ్చు.
టెక్ట్స్ డిజైన్ మార్చడమెలా
వాట్సాప్‌లో మీ స్నేహితులకు పంపించే మెసేజ్‌లు సాధారణంగా కంటే డిఫరెంట్‌గా ఉండాలని అనుకుంటున్నారా? అప్పుడు మీరు పంపే మెసేజ్‌లను బోల్డ్ లేదా ఇటాలిక్ ఫాంట్‌లో పంపించండి.
ఇందుకోసం.. మీరు కంపోజ్ చేసిన మెసేజ్ ముందు, చివరలో (*) ఎంటర్ చేయండి. అదే ఇటాలిక్ కావాలని అనుకుంటే కంపోజ్ చేసిన టెక్ట్స్ ముందు, చివరలో ( _ )ఎంటర్ చేయండి.