మేడ్చల్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. దమ్మాయిగూడ సిద్ధార్థనగర్ కాలనీలో నివాసం ఉంటోన్న రవీందర్ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. 30 తులాల బంగారం, రూ. లక్షల నగదు, 50 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితుడు తెలిపాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.