ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఘోర పరాజయంతో ముగించింది. అందరి దృష్టి తదుపరి సిరీస్‌పైనే ఉంది. టీమిండియా తన తదుపరి సిరీస్‌ని సొంతగడ్డపై ఆడనుంది. కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్ జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించనుంది. ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుండగా.. తొలి టీ20 కోల్‌కతాలో, రెండో టీ20 చెన్నైలో, మూడో టీ20 రాజ్‌కోట్‌లో, నాలుగో టీ20 పూణేలో, ఐదో టీ20 ముంబైలో ఫిబ్రవరి 2న జరగనుంది.