Homeసినిమా‘సరిపోలేదా శనివారం’ రిలీజ్ ఎప్పుడంటే..

‘సరిపోలేదా శనివారం’ రిలీజ్ ఎప్పుడంటే..

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్​గా రిలీజైన హాయ్ నాన్న మూవీ ఆడియెన్స్​ను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే, నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్​లో ‘సరిపోదా శనివారం’సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో గతేడాది వచ్చిన అంఏ సుందరానికి మూవీ మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరూ జత కట్టడంతో ఆడియెన్స్​, నాని ఫ్యాన్స్​లో ఆసక్తి నెలకొంది. అయితే, సరిపోదా శనివారం మూవీని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్​ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తొందరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రియాంక అరుల్​ మోహన్ హీరోయిన్​గా నటిస్తుండగా.. డైరెక్టర్, నటుడు ఎస్​జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి జేక్స్ బెజాయ్ మ్యూజిక్​ అందిస్తున్నాడు.

Recent

- Advertisment -spot_img