ఇదే నిజం, ధర్మపురి టౌన్ : రైతులకు బోనస్ ఎప్పుడు అని జగిత్యాల జిల్లా రైతులు ప్రశ్నిస్తున్నారు. ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జనవరి 26-2025 రోజున ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామంలో నాలుగు పథకాలు ప్రారంభించినా రోజు రైతులు మాకు బోనస్ రాలేదు అని రైతులు అడగగా రెండు మూడు రోజులలో కలెక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని కలెక్టర్ మరియు సివిల్ సప్లై అధికారులతో మాట్లాడి రైతులకు బోనస్ వచ్చే విధంగా చూస్తాను అని అన్నారు. హామీ ఇచ్చి 25 రోజులు పూర్తయిన కానీ ఇంతవరకు కలెక్టర్ తో మాట్లాడింది లేదు. రైతులకు బోనస్ పడ్డది లేదు ఇదేనా కాంగ్రెస్ పాలన అంటే అని రైతులు నిలదీశారు.