Homeహైదరాబాద్latest Newsఉదయం లేవగానే దంపతులు ఇద్దరూ ఈ పనులు చేయండి.. మీ జీవితం సంతోషంగా ఉంటుంది!

ఉదయం లేవగానే దంపతులు ఇద్దరూ ఈ పనులు చేయండి.. మీ జీవితం సంతోషంగా ఉంటుంది!

ఉదయం లేవగానే దంపతులు ఇద్దరూ ఈ పనులు చేస్తే మీ జీవితం సంతోషంగా ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

విషెస్
మార్నింగ్ లేవగానే స్వీట్‌గా “గుడ్ మార్నింగ్” అని చెప్తే చాలు పార్ట్‌నర్‌ మూడ్ హ్యాపీగా మారుతుంది. ఉదయం లేవగానే మొదటి ఆలోచన వారి గురించేనని చెప్పినట్లు అవుతుంది. పార్ట్‌నర్‌కు చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లు ఇది చూపిస్తుంది. పడుకునేటప్పుడు కూడా గుడ్ నైట్ చెబితే పార్ట్‌నర్‌ మంచిగా ఫీలవుతారు. వారు కూడా అదే విధంగా అఫెక్షన్ చూపిస్తూ మరింత దగ్గరవుతారు. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ లాంటి విషెస్ చెప్పుకోవడం ఒక అలవాటుగా మార్చుకుంటే వివాహ బంధంలో చిన్నపాటి అలకలు ఉన్నా వాటిని అధిగమించడం సులభం అవుతుంది.

కలిసి బెడ్ కాఫీ లేదా బ్రేక్‌ఫాస్ట్
లేచాక ఎవరి దారిన వారు వెళ్లకుండా ఇద్దరూ కలిసి బ్రెడ్ కాఫీ తాగాలి లేదంటే బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ఈ సమయంలో క్వాలిటీ టైమ్‌ కలిసి పొందినట్లు అవుతుంది. ఆరోజు ప్లాన్లను ఇద్దరూ డిస్కస్ చేసుకొని ఒక మంచి కనెక్షన్‌ను ఫీల్ అవ్వచ్చు. రోజువారీ పనులకు ముందు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ముచ్చటిస్తే మ్యారేజ్ లైఫ్ చాలా కలర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఎమోషనల్ బాండ్ బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఫిజికల్ అఫెక్షన్
పార్ట్‌నర్‌ను కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, చేతులు పట్టుకోవడం ద్వారా ఫిజికల్ అఫెక్షన్ చూపించవచ్చు. ఫిజికల్ టచ్ వల్ల పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. క్లోజ్‌నెస్ ఫీలింగ్ పెరుగుతుంది. ఫిజికల్ టచ్ అంటే పని చేస్తున్నప్పుడు పార్ట్‌నర్‌ భుజాలను తడమడం, ఫుడ్ తింటున్నప్పుడు చేతులు పట్టుకోవడం వంటివి చేయాలి. దీనివల్ల రిలేషన్‌షిప్‌లో ఇంటిమసీ బలపడుతుంది, కనెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది.

డీప్ కన్వర్జేషన్స్‌
ఉదయం సమయం దొరికినప్పుడు పార్ట్‌నర్‌తో మాట్లాడాలి. వారి కళ్ళలోకి చూస్తూ, వారు చెప్పే మాటలను చాలా శ్రద్ధగా వినాలి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి. డీప్ కన్వర్జేషన్స్‌ మొదలుపెట్టి పార్ట్‌నర్ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కలిసి సరదాగా గడిపేందుకు వాకింగ్‌కి వెళ్లడం లేదా డేట్ నైట్ లాంటివి ప్లాన్ చేయాలి. దీని వల్ల పార్ట్‌నర్‌తో మరింత సన్నిహితంగా, సంతోషంగా ఉండొచ్చు.

పార్ట్‌నర్‌కు కృతజ్ఞతలు
పార్ట్‌నర్‌కు అన్ని విషయాల్లోనూ కృతజ్ఞతలు తెలియజేయాలి. జీవితంలోకి వచ్చి అన్ని విషయాల్లో సపోర్టుగా నిలుస్తున్నందుకు థాంక్యూ అని చెప్పి హగ్ చేసుకోవాలి. కనెక్షన్‌ను మరింత ఇంప్రూవ్ చేసుకునేందుకు వ్యాయామం, ధ్యానం, జర్నలింగ్ లేదా మ్యూజిక్ వినడం వంటి యాక్టివిటీలలో కలిసి పాల్గొనాలి.

Recent

- Advertisment -spot_img