తాజాగా గుజరాత్‌లోని వడోదరలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దీపావళిపురా ప్రాంతంలో రంజిత్, దిశాంత్ రాజ్‌పుత్ అనే స్నేహితులు ఉన్నారు. రంజిత్ కు లవర్ లేదని దిశాంత్ ఎప్పుడూ హేళన చేసేవాడు.. ఓ రోజు అందరిలో ఎగతాళి చేసి ఏడ్పించాడు. దిశాంత్ మాటలను తట్టుకోలేని రంజిత్ తన స్నేహితులతో కలిసి దిశాంత్‌కు ఫోన్ చేసి కోర్టు కాంప్లెక్స్ ప్రాంతానికి రమ్మని చెప్పాడు. దిశాంత్ వచ్చాక కత్తితో పొడిచి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.