Homeఫ్లాష్ ఫ్లాష్Where is the money for the helicopters? హెలిక్యాప్టర్లకు డబ్బులు ఎక్కడివి?

Where is the money for the helicopters? హెలిక్యాప్టర్లకు డబ్బులు ఎక్కడివి?

– బీఆర్ఎస్​పై ఈసీకి ఫిర్యాదు చేస్తా..
– కాంగ్రెస్​ దౌర్జన్యం చేస్తే తెలంగాణ వచ్చేది కాదు
– కాంగ్రెస్ నేత షబ్బీర్​ అలీ

ఇదేనిజం, హైదరాబాద్​: బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​ రావు, కవిత కోసం నాలుగు హెలిక్యాప్టర్లు కొనుగోలు చేసిందని కాంగ్రెస్ నేత షబ్బీర్​ అలీ ఆరోపించారు. వీటి కొనుగోలుకు బీఆర్ఎస్ దగ్గర డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్‌ రాజకీయ భిక్ష పెట్టిందని ఆ పార్టీ నేత షబ్బీర్‌ అలీ గుర్తు చేశారు. ఒకవేళ కాంగ్రెస్‌ దౌర్జన్యం చేసి ఉంటే.. తెలంగాణ ఉద్యమం జరిగేది కాదన్నారు. కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రజలు ఆందోళన చేయకుండా అణచివేస్తోందని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారాస నేతలపై విమర్శలు గుప్పించారు. ‘కేసీఆర్‌, హరీశ్‌, కేటీఆర్‌, కవిత కోసం 4 హెలికాప్టర్లు తీసుకున్నారు. ఎవరి డబ్బులతో వాటిలో తిరుగుతున్నారో ఈసీ తేల్చాలి. బీఆర్ఎస్​ నేతల హెలికాప్టర్‌ పర్యటనలపై ఈసీకి ఫిర్యాదు చేస్తా.’ అని షబ్బీర్​ అలీ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img