రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో కాంగ్రేస్ నాయకత్వంలో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. సోనియా గాంధీ అధ్యక్ష్యతపై 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు లేఖ రాయడంతో రాహుల్ గాంధీ సీనియర్లపై బగ్గుమన్నారు. ఈ క్రమంలో ఈరోజు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తూ సీనియర్ నేత కపిల్ సిబాల్ ఓ ట్వీట్ చేశారు. 30 ఏళ్లలో ఏనాడూ బీజేపీకి అనుకూలంగా తాను ఎప్పుడూ వ్యవహరించలేదని సిబాల్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలు బాధపెట్టినట్లు ఆయన ట్వీట్లో తెలిపారు. కాంగ్రేస్ ముఖ్య నేత గులాం నబీ ఆజాద్ కూడా రాహుల్ పై సీరియస్ అయ్యారు. అనంతరం కాసేపటికి సిబాల్ రాహుల్‌తో మాట్లాడినట్లు, రాహుల్ ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకునట్లు తెలిపి తన ట్వీట్‌ను డిలేట్ చేశారు. ఇక గులాం నబీ ఆజాద్ ఎలా స్పందిస్తారో చూడాలి