White House : అమెరికాలో వైట్ హౌస్‌పై (White House) దాడి చేసిన తెలుగు యువకుడికి 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2023లో అమెరికాలోని వైట్‌హౌస్‌లో తెలుగు సంతతికి చెందిన యువకుడు ట్రక్కుతో దాడి చేసాడు. అలాగే నాజీ జెండాను పట్టుకొని అప్పటి యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌ను హతమార్చి, డెమోక్రటిక్ పార్టీని దించడమే తన లక్ష్యమని నినాదాలు చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడు జో బిడెన్‌ను చంపడానికి ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అని అధికారులు చెప్పలేదు. ఆరు నెలలుగా ప్లాన్ చేసి ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనలో నిందితుడు 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వర్షిత్ కు 8 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి డాబ్నీ ఫ్రెడరిక్ ప్రకటించారు.