Homeహైదరాబాద్latest Newsవారెవ్వా.. ఆలోచన అదిరింది గురూ.. పరుగులు పెట్టే రిక్షా..!

వారెవ్వా.. ఆలోచన అదిరింది గురూ.. పరుగులు పెట్టే రిక్షా..!

ఇదే నిజం, కోదాడ: ఒంట్లో శక్తినంతా కూడదిసుకుని పొద్దంతా కష్టపడితే వచ్చే ఆదాయం సగం ఆసుపత్రికే ఖర్చు అయ్యేది రోజు రిక్షా తొక్కడంతో కాళ్ల నొప్పులు వచ్చేవి చేసేదేమీ లేక వినూత్నంగా ఆలోచించి రిక్షాకు మో పెడ్ (ఎక్సెల్) వాహనం వింజన్ బిగించి హాయిగా తొక్కకుండానే రిక్షాను నడుపుతున్నాడు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలానికి చెందిన మాతంగి నాగయ్య రూ, 20, వేలు అప్పు చేసి కోదాడలో ఓ మెకానిక్ దుకాణంలో ఎక్సెల్ వాహనం ఇంజన్ ను రిక్షా కింది భాగంలో అమర్చాడు. దీంతో దూర ప్రాంతాలకు సైతం కిరాయిలకు వెళ్తున్నారు. నాగయ్య ఖర్చులు పోను రోజు రూ, 500 నుంచి రూ, 800 వరకు వస్తుందని చెప్పకొచ్చారు.

Recent

- Advertisment -spot_img