Homeతెలంగాణతెలంగాణ ఐటీ మినిస్టర్​ ఎవరు?

తెలంగాణ ఐటీ మినిస్టర్​ ఎవరు?

– సోషల్ మీడియాలో ట్రెండింగ్
– బెస్ట్ ఐటీ మినిస్టర్​ కేటీఆర్​ను కోల్పోయామంటూ నెటిజన్లు ట్వీట్

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ సీఎం ఎవరు? అనే దానిపై ఎక్కువగా చర్చ నడుస్తోంది. దీంతో పాటు మరో అంశం ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణకు ఐటీ మినిస్టర్ ఎవరు కాబోతున్నారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఐటీ రంగం అభివృద్ధి కోసం కేటీఆర్‌ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. సీఎం ఎవరు అవుతారనేది కాదు.. కేటీఆర్‌కు సరిపోయే ఐటీ మినిస్టర్‌ను కాంగ్రెస్‌ తీసుకురాగలదా? అని చర్చించుకుంటున్నారు.‘ఇప్పటివరకు మేం చూసిన బెస్ట్‌ ఐటీ మినిస్టర్‌ మీరే’.. ‘తెలంగాణ బెస్ట్‌ ఐటీ మినిస్టర్‌ను కోల్పోయింది’.. అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. ఐటీ మినిస్టర్‌ అనే పదానికి కేటీఆర్‌ రోల్‌ మాడల్‌ అని.. విజనరీ నాయకత్వాన్ని మిస్సవుతున్నామని కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్‌ ఇంతగా అభివృద్ధి చెంది.. ఉద్యోగవకాశాలతో లక్షలాది మంది ఇక్కడ జీవిస్తున్నారంటే దానికి కారణం మీరేనంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్‌ను ట్రెండ్‌ సెట్టర్‌ అంటూ మరికొందరు నెటిజన్లు కొనియాడుతున్నారు.

Recent

- Advertisment -spot_img