బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న ఆందోళనలతో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లిపోయారు షేక్ హసీనా. ఆమె బంగ్లాదేశ్ పాలక పార్టీ అవామీ లీగ్ నాయకురాలు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, జాతిపితగా పిలిచే షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా షేక్ హసీనా పేరొందారు. షేక్ హసీనా 2009 నుంచి బంగ్లాదేశ్‌ను పాలిస్తున్నారు.