నేహా శర్మ.. రామ్ చరణ్ మొదటి సినిమా ‘చిరుత’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. నటి నేహా శర్మ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మెరిశారు. తన తండ్రి అజిత్ శర్మ తరుఫున రోడ్ షో నిర్వహించారు. బీహార్‌లోని భాగల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అజిత్ శర్మ ఎన్నికల బరిలో నిలిచారు. రెండో దశలో పోలింగ్ జరగనున్న ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది.
అజిత్ శర్మ కుమార్తె బాలీవుడ్ నటి నేహా శర్మ సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేహా శర్మ తన తండ్రి కోసం రోడ్ షో చేసి ప్రజల నుండి ఓట్లు కోరారు. బీహార్, భాగల్‌పూర్, బంకా, కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియాలోని ఐదు జిల్లాల్లో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఒకవైపు భాగల్‌పూర్‌లో ఎన్డీయే అభ్యర్థి అజయ్ మండల్ తన ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

