Cloud is in trouble for something. Who is the cause of this suffering? Why did the cloud eyes blink? Is clear from watching the movie ‘Dear Megha’.
The title role of Megha Akash is the upcoming film ‘DearMegha’. Arjun Dasyan is producing in the lead roles of Arun Adit and Arjun Somayaju. Sushant Reddy is the director.
మేఘ ఏదో బాధలో ఉంది. ఈ బాధకు కారణం ఎవరు? మేఘ కళ్లు ఎందుకు చెమర్చాయి? అనేది ‘డియర్ మేఘ’ సినిమా చూస్తే తెలుస్తుంది.
మేఘా ఆకాశ్ టైటిల్ రోల్‌లో రూపొందుతున్న చిత్రం ‘డియర్ మేఘ’. అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. సుశాంత్ రెడ్డి దర్శకుడు.
ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రానా, గౌతమ్ వాసుదేవమీనన్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విజయ్ సేతుపతి విడుదల చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.
మోషన్ పోస్టర్‌లో మేఘ కన్నీరు పెట్టుకుంటూ, బాధలో ఉన్నట్లు కనబడుతుంది. ‘‘మా సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది.
త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: ఐ ఆండ్రూ, ఎడిటర్: ప్రవీణ్ పూడి.