నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో కి అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. ఈ కార్యక్రమంలో, అల్లు అర్జున్ ని బాలకృష్ణ ఒక ఆసక్తికర ప్రశ్న అడిగారు. టాలీవుడ్ లో టాప్ డాన్సర్ ఎవరంటూ బాలకృష్ణ అడగగా అల్లుఅర్జున్ వేంటనే నేను బెస్ట్ డాన్సర్ అని అన్నారు. ఆ తర్వాత నేను సరదాగా అలా అన్నానని చాలా మంది డాన్సర్స్ ఉన్నారు అని బన్నీ చెప్పాడు. దీంతో బాలకృష్ణ కాదు నువ్వే బెస్ట్ డాన్సర్ అని అంటారు.. మీరు చెబుతున్నారు కాబట్టి నేనే బెస్ట్ డాన్సర్ అని అల్లు అర్జున్ ఒప్పుకుంటాడు. ప్రస్తుతం ఈ టాక్ షో ప్రముఖ ఓటిటి సంస్థ ‘ఆహాలో’ స్ట్రీమింగ్ అవుతుంది.