Homeహైదరాబాద్latest Newsఅసలు వీడు మనిషేనా.. భార్యాపిల్లలను గొంతు నులిమి చంపేశాడు

అసలు వీడు మనిషేనా.. భార్యాపిల్లలను గొంతు నులిమి చంపేశాడు

ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ రాక్షసుడు తన భార్యాపిల్లలను గొంతు నులిమి దారుణంగా చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు గౌతమ్‌ తన భార్య జ్యోతి(36), కుమార్తె(6), కుమారుడు(9)లతో లఖ్‌నవూలోని బిజ్నోర్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. తన భార్యకు ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తూ తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం వీరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఆ రాత్రి భార్య నిద్రిస్తుండగా మెడకు చున్నీ బిగించి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పిల్లలను గొంతు నులిమి చంపేశాడు. మరుసటి రోజు ఉదయం చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా ఇంటికి తాళం వేసి పనికి వెళ్లాడు. అలా అదే గదిలో మూడు రోజుల పాటు మృతదేహాల పక్కనే నిద్రించి ఉదయం పనులకు వెళ్లేవాడు. గది నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గది తాళం పగలగొట్టి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img