నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో, అల్లు అర్జున్ ని బాలకృష్ణ ఒక ఆసక్తికర ప్రశ్న అడిగారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నీకు పోటీ ఎవరు..ప్రభాస్.. మహేష్..అని బాలకృష్ణ అడిగారు. దానికి అల్లుఅర్జున సమాధానంగా… ‘నన్ను మించి ఎదిగేటోడు ఇంకొకడున్నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే’ అంటూ పుష్పలోని సాంగ్ పాడారు. ఈ ఇండస్ట్రీలో నాకు నేనే పోటీ అని అల్లు అర్జున అన్నారు. జీవితంలో ఎప్పుడు మనతో మనమే పోటీ పడాలి అని ఐకాన్ స్టార్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లుఅర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ టాక్ షో ప్రముఖ ఓటిటి సంస్థ ‘ఆహాలో’ స్ట్రీమింగ్ అవుతుంది.