Homeహైదరాబాద్latest Newsఎవరి సొమ్ము..ఎవరికి నివాళి.. రామోజీకి నివాళి అర్పించేందుకు ఏపీ సర్కారు భారీ ఖర్చు..!

ఎవరి సొమ్ము..ఎవరికి నివాళి.. రామోజీకి నివాళి అర్పించేందుకు ఏపీ సర్కారు భారీ ఖర్చు..!

  • లక్షల రూపాయల ఖర్చుతో రామోజీకి సంస్మరణ సభ
  • కోట్ల రూపాయలతో ప్రభుత్వ ప్రకటనలు
  • రామోజీకి నివాళి అర్పించేందుకు ఏపీ సర్కారు భారీ ఖర్చు
  • దుబారా చేస్తోందని గత ప్రభుత్వాన్ని తిట్టిపోసిన టీడీపీ.. ఇప్పుడు ఆ పార్టీ చేసిందేంటి?

ఇదేనిజం, ఏపీ బ్యూరో: ఇటీవల మృతి చెందిన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభను ఏపీ సర్కారు అట్టహాసంగా నిర్వహించింది. ప్రభుత్వ ఖర్చులతో ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన పత్రికలకు ఇబ్బడిముబ్బడిగా పత్రికా ప్రకటనలు ఇచ్చారు. అయితే రామోజీరావుకు చంద్రబాబు నాయుడు నివాళి అర్పించడాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు. కానీ ప్రభుత్వ సొమ్ముతో ఆయనకు సంస్మరణ సభ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నించారు. రామోజీరావు సంస్మరణ సభ, పత్రికా ప్రకటనలకు కచ్చితంగా రూ. కోట్లు ఖర్చు అయ్యింది. ఇదంత ప్రజల సొమ్మే. రామోజీరావుకు రాజకీయనాయకుడు కాదు.. ప్రజా సేవ చేసిన వ్యక్తి అంతకన్న కాదు. కేవలం వ్యాపారవేత్త. ఓ తెలుగు దినపత్రికకు ఓనర్. అటువంటి వ్యక్తి చనిపోతే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ఇష్టాఇష్టాలతో ఆయన కోసం ఏం చేసినా ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయరు. కానీ ప్రభుత్వ ఖర్చుతో ఆయనకు నివాళి అర్పించడంపై విమర్శలు వస్తున్నాయి.

ఓ పార్టీకి కొమ్ముకాసిన ఈనాడు!
ఈనాడు దినపత్రిక అత్యధిక సర్క్యులేషన్ ఉన్న తెలుగు దినపత్రిక. అయితే ఈ పత్రిక మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఓ పార్టీకి కొమ్ముకాసిందన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని రాజకీయపార్టీలు ఈనాడును తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటాయి. అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉండటంతో రామోజీరావు సంస్మరణసభను చంద్రబాబు అధికారికంగానే నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు చనిపోతే వారికి సంస్మరణ సభలు నిర్వహించడం పై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావు. కానీ రామోజీరావు సంస్మరణ సభ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రాష్ట్రం అప్పుల పాలైంది. జగన్ సర్కారు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించిన టీడీపీ.. ఇప్పుడు పవర్ లోకి వస్తే చేసిందేంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img