Homeహైదరాబాద్latest NewsRamoji Rao Death : ఆ వార్తను ఫ్రంట్ పేజీలో ఎందుకు ఇవ్వలేదు?

Ramoji Rao Death : ఆ వార్తను ఫ్రంట్ పేజీలో ఎందుకు ఇవ్వలేదు?

– Why Ramoji Rao’s Death news was not given on the front page of Eenadu News Paper?

తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశవ్యాప్తంగా పత్రికా రంగంలో సంచలనం సృష్టించిన రామోజీ రావు మృతి బాధాకరం. స్వకృషి, నిజాయతీ, నిబద్ధత, విలువలు, క్రమశిక్షణే ఆయన ప్రధాన అస్త్రాలు. గత 50 ఏళ్లుగా విజయవంతంగా ఈనాడు ప్రస్థానం కొనసాగుతోంది. ఈ విజయం వెనుక అనేక మంది కృషి ఉన్నా మూలం మాత్రం ఆయన ఎంచుకుని పాటిచిన విధానాలే. సంస్థలో కొన్ని వేల మంది పని చేస్తున్నా ఉమ్మడి కార్యాచరణే అక్కడ కీలకం. కింది స్థాయి ఉద్యోగుల సలహాలు, సూచనలు వంటివి ఆయన ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. కానీ చివరికి ఆయనకు నచ్చిందే చేస్తారనే టాక్ ఉంది. ఆయన పెంచిపోషించిన పత్రికే మరణం రోజున తన ఫొటోను ఫ్రంట్ పేజీలో ప్రచురించకపోవడం గమనార్హం. ఈ వార్తను ఈనాడు పత్రిక ఎలా ప్రజెంట్ చేస్తుంది అని అనేకమంది ఎదురుచూశారు. కానీ వాళ్ల అంచనాలకు అందకుండా ఓ ప్రముఖ కాలేజీలో విద్యార్థులు సాధించిన ర్యాంకులతో యాడ్స్ ఇచ్చారు. దీన్ని బట్టి ఆయన తన వ్యాపార రంగాల్లో పాటించే నియమాలు ఎంత కఠినంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. తన మరణానికి సంబంధించి ఈనాడు ప్రచురించిన కథనం లోపలి పేజీల్లో రావడమనేది రామోజీరావు ఆత్మకు ఓకేనా! మిలియన్ డాలర్ ప్రశ్న .

Recent

- Advertisment -spot_img