Loan App Scam : పుణెకు చెందిన ఓ వ్యక్తి అవసరం నిమిత్తం ఓ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు. ఆ రుణాన్ని చెల్లించడానికి మరో యాప్ ద్వారా..దాని కోసం ఇంకో రుణం. ఇలా మొత్తంగా రూ.4,66,170 అప్పు చేశాడు. అయితే యాప్ యజమానులు డబ్బులు కట్టాలని ఆయనను బెదిరిస్తున్నారు. అతని ఫోన్‌లోని కాంటాక్టులు, ఫోటోలను యాప్ నిర్వాహకులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఫోన్‌లో ఉన్న ఆయన భార్య నగ్న చిత్రాలను అందరికీ పంపిస్తామని బెదిరిస్తున్నారు. అప్పులు చెల్లించేందుకు తన భార్య నగలన్నీ అమ్మేసానని చెబుతున్నాడు. ” వారు అంత తేలిగ్గా వదిలిపెట్టరు. నన్ను చంపేస్తారేమోనని భయంగా ఉంది. రోజూ బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి” అని తెలిపాడు.