తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 మంచి జోరుగా నడుస్తుంది. అయితే ఐదు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ హౌస్‌లోకి ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగ టేస్టీ తేజ, గంగవ్వ, నాయని పావని, మెహబూబ్ దిల్ సే, హరితేజ, నూక అవినాష్, గౌతమ్ కృష్ణ, రోహిణి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.. వీరి ఎంట్రీతో హౌస్లో విజేత లెక్కలు పూర్తిగా మారిపోయాయి. నిన్న హౌస్‌లో నామినేషన్లు పూర్తయ్యాయి మరియు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వారు అంత యష్మిని, పృథ్వీ, విష్ణు ప్రియ మరియు సీతలను నామినేట్ చేసారు.. ఈ నామినేషన్ల ప్రక్రియ ఆటను మార్చింది. హౌస్ మేట్స్ నాగ మణికంఠను కలిసి నామినేట్ చేశారు.. దాంతో అతను ఉద్వేగానికి లోనయ్యాడు.. ఇలా చేయకూడదు అని హౌస్ మేట్స్ ని నామినేట్ చేశారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన టేస్టీ తేజ మాత్రం పాయింట్ మాట్లాడాడు. తేజ మణికంఠను నామినేట్ చేస్తూ నీకు తప్ప ఎవరికి ప్రాబ్లెమ్స్ లేవనుకుంటున్నావా మణికంఠ.. నీ వల్ల మిగితా వాళ్ళు అందరూ మరోలా కనిపిస్తున్నారు అంటూ.. తేజ చెప్పాడు. ఈసారి సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ విజేతగా నిలవబోతున్నాడని.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.