Homeహైదరాబాద్latest Newsఅల్లు అర్జున్ నేషనల్ అవార్డును వెనక్కి తీసుకొంటారా..! కేంద్రం ఏమంటుంది..?

అల్లు అర్జున్ నేషనల్ అవార్డును వెనక్కి తీసుకొంటారా..! కేంద్రం ఏమంటుంది..?

‘పుష్ప 2’ మూవీ సందర్భంగా చిక్కడపల్లి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను నిన్న పోలీసుల అరెస్ట్ చేసారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో అల్లు అర్జున్ నిందితుడు కావడంతో జాతీయ అవార్డును కూడా వెనక్కి తీసుకొంటారా? అనే చర్చ ఫిలింనగర్‌లో నడుస్తోంది. అయితే గతంలో జానీ మాస్టర్‌కు వచ్చిన జాతీయ అవార్డును కేంద్రం వెనక్కి తీసుకుంది. జానీ మాస్టర్ లైంగిక దాడికి కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అయనకు రావాల్సిన జాతీయ అవార్డు రాలేదు. అలానే ప్రస్తుతం తొక్కిసలాట కేసులో నిందితుడు ఉన్న అల్లు అర్జున్ జాతీయ అవార్డు కూడా కేంద్రం వెనక్కి తీసుకుంటుందా లేదా అనే చర్చ జరుగుతుంది.

Recent

- Advertisment -spot_img